టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్ జట్టు

టీ20 చివరి మ్యాచ్ లో వెస్టిండీస్ జట్టు టాస్ గెలిచింది. విండీస్ జట్టు కెప్టెన్ బ్రాత్ వైట్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇప్పటికే సిరీస్ ను సొంతం చేసుకున్న టీమిండియా ఈ మ్యాచ్ లో కూడా విజయం సాధించి క్లీన్ స్వీప్ చేయాలని చూస్తుండగా, ఒక్క మ్యాచ్ లోనైనా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని విండీస్ జట్టు చూస్తోంది.

ఇక టీమిండియా ప్లేయర్ కులదీప్ యాదవ్ స్థానంలో వాషింగ్టన్ సుందర్ జట్టులోకి వచ్చాడు. చెన్నై వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ లో భారత్ తరపున రోహిత్ శర్మ, ధావన్, కేఎల్ రాహుల్, పంత్, మనీష్, కార్తీక్, కృనాల్, సుందర్, భువనేశ్వర్ కుమార్, ఖలీల్, చాహల్ ఆడనున్నారు.  
Go Back to Shorts
India
west indies
t20
chennai

More Telugu News